కర్నూలు జిల్లా ఆదోనిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు రెండు సెంట్ల ఇంటి స్థలం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 18వ తేదీ అన్ని సచివాలయాల ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ సుదర్శన్ తెలిపారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన పట్టణ కార్యదర్శి సుదర్శన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుపేద కుటుంబానికి రెండు సెంట్లు స్థలము ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయిస్తామని ఎన్నో ప్రగల్బాలు పలికిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయిపోయినప్పటికీ పేద ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయించకపోవడం, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వకపోవడం వారి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడికి ఇంటి స్థలాలు ఇవ్వాలని ఉద్దేశంతో 18వ తేదీ సోమవారం వార్డు సచివాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.