Connect with us

News

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయం..

Published

on

ఢిల్లీ, జులై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పోటీ పరీక్షలో పేపర్ లీక్‌, పరీక్షల నిర్వహణపై తలెత్తిన వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. నీట్ పరీక్ష ప్రశ్నా పత్రం లీక్ వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు నిరసనలు చేపట్టి, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026 ముసాయిదాను విడుదల చేసి, పేపర్ లీక్‌లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, భారీ జరిమానాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కాలపరిమితిలో విచారణ వంటి కీలక నిబంధనలను ప్రతిపాదించింది.

విద్యార్థుల విజయం సంబరాలు

అంతేకాదు, మరో అడుగు ముందుకు వేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఇప్పుడు ఈ వివాదానికి శాశ్వత పరిష్కారంగా నిలిచింది. మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ బాధ్యతలను ఎవరు చేపడతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. త్వరలోనే కొత్త విద్యాశాఖ మంత్రిని నియమించే అవకాశం ఉంది. అయితే రాజీనామాపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన, రాష్ట్రపతి ఆమోదం, తదుపరి బాధ్యతల కేటాయింపుపై పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉండగా, విద్యార్థి సంఘాలు ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, బాధ్యులపై కఠిన చర్యలు, దీర్ఘకాలిక సంస్కరణలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయి.

ఢిల్లీ మెట్రో స్టేషన్ లు తెచ్చుకున్నాయి..

విద్యార్థుల విజయం సంబరాలు
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని విశ్వనారాయణ కళాశాల ఎదుట PDSU ధర్నా

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విశ్వనారాయణ కళాశాల ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు అఖండ, మండల అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విశ్వనారాయణ కళాశాల యాజమాన్యం ఒకే భవనంలో ఇంటర్, ఒకేషనల్, పల్లవి పారామెడికల్ కళాశాలలను నడుపుతోందని మండిపడ్డారు. పారామెడికల్ కళాశాలకు అనుమతి​ఎస్.కె.డి కాలనీ చిరునామాతో పొంది, అధికారుల కళ్లు గప్పి విశ్వనారాయణ కాలేజీ బిల్డింగ్‌లోనే తరగతులు […]

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విశ్వనారాయణ కళాశాల ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు అఖండ, మండల అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విశ్వనారాయణ కళాశాల యాజమాన్యం ఒకే భవనంలో ఇంటర్, ఒకేషనల్, పల్లవి పారామెడికల్ కళాశాలలను నడుపుతోందని మండిపడ్డారు. పారామెడికల్ కళాశాలకు అనుమతి​ఎస్.కె.డి కాలనీ చిరునామాతో పొంది, అధికారుల కళ్లు గప్పి విశ్వనారాయణ కాలేజీ బిల్డింగ్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పారామెడికల్ బోర్డు అనుమతి పత్రం (పర్మిషన్ బోర్డు) కూడా లేకుండానే విద్యార్థుల వద్ద భారీగా ఫీజులు వసూలు చేశారని తెలిపారు. కాలేజీ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు తరగతులు ప్రారంభించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.

విశ్వ నారాయణ కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్న పిడిఎస్యు నాయకులు

​అంతేకాకుండా తరగతులు జరుగుతున్న సమయంలోనే అదే భవనంపై నిర్మాణాలు (కన్స్ట్రక్షన్) చేపడుతున్నారని, దీనివల్ల విద్యార్థులకు ఏమైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న విశ్వనారాయణ కళాశాలపై ఇంటర్మీడియట్ బోర్డు, ఏపీ పారామెడికల్ బోర్డు అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పి.డి.ఎస్.యు మండల నాయకులు బసవ, విష్ణు, ముని, గోవర్ధన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

విశ్వ నారాయణ కళాశాల ఎదుట బైఠాయించిన పిడిఎస్యు నాయకులు
వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Continue Reading

News

ఆదోనికి 6 కొత్త ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని ఎంసిహెచ్ (MCH) ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మంగళవారం నూతనంగా మంజూరైన 102 ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాల ను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి రిబ్బన్ కట్ చేసి నూతన వాహనాలను ప్రారంభించారు.

మెడికల్ అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పార్థసారథి

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదోని నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం మొత్తం 6 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ నూతన వాహనాలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. కర్నూలు జిల్లాలోనే అత్యధిక ప్రసవాలు జరిగే ఆసుపత్రుల్లో ఆదోని ఎంసిహెచ్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రసవం అనంతరం బాలింతలను, పసిపాపలను సురక్షితంగా, ఉచితంగా ఇంటికి చేర్చేందుకు ఈ వాహనాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని తల్లులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పార్థసారధి

​ఈ కార్యక్రమంలో ఎంసిహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు లలితమ్మ, రేణు వర్మ, నాయకులు ఉపేంద్ర కుమార్, మధుసూదన్ శర్మ, ప్రశాంత్ కుమార్, వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

News

ఆదోని జిల్లా సాధన రిలే నిరాహార దీక్ష తాత్కాలిక విరామం

Published

on

కర్నూలు జిల్లా అదోనిలో గత 269 రోజులుగా ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు తాత్కాలికంగా విరామం లభించింది. ఆదోని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కే. మీనాక్షి నాయుడు విజ్ఞప్తి మేరకు జేఏసీ నాయకులు దీక్షా శిబిరాన్ని విరమించి వేదికను తొలగించారు.

దీక్ష శిబిరాన్ని తొలగిస్తున్న ఫోటో

దీక్ష విరమణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడుతూ — రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, సాంకేతిక అంశాల దృష్ట్యా తక్షణమే కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు ఆమోదం పొందిన వెంటనే, కొత్త నియోజకవర్గాలు మరియు జిల్లాల సంఖ్య పెరుగుతుందని ఆ సమయంలో ఆదోనిని జిల్లాగా ప్రకటించే అంశాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని లోకేష్ మరియు ఇన్‌చార్జ్ మంత్రి హామీ ఇచ్చారని మీనాక్షి నాయుడు వెల్లడించారు.

దీక్ష శిబిరం వద్ద మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు

జేఏసీ ప్రతినిధులు వై.పి. నాగరాజ్, సుజ్ఞానమ్మ, దేవశెట్టి ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ — గత 269 రోజులుగా పశ్చిమ కర్నూలు ప్రాంత ప్రజల కాంక్ష మేరకు సాగిన ఈ ఉద్యమానికి ఆదోనితో పాటు ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని జేఏసీ నాయకులు గుర్తుచేశారు. కుల, మత, రాజకీయ పార్టీల అతీతంగా వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, పత్రికా ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాలు ఈ దీక్షలకు పూర్తి మద్దతు తెలిపారుఅని ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం కాదని 77 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పశ్చిమ ప్రాంత సమగ్ర అభివృద్ధి, మెరుగైన వైద్యం, తాగు/సాగు నీటి లభ్యత కోసమే ఈ పోరాటం ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా 269 రోజుల పాటు ఉద్యమానికి సహకరించిన ప్రజలకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా ప్రతినిధులకు జేఏసీ నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

దీక్ష శిబిరాన్ని తొలగిస్తున్న జేఏసీ నాయకులు
Continue Reading

Trending