ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగం తో గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆయన ఆశయాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యాన్ని పేదలకు అందిస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో 77 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జాతీయ జెండాను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎగరవేశారు. అనంతరం ఎస్ఈఆర్పి(SERP) వైఎస్ఆర్ క్రాంతి పథకంలో ఉద్యోగస్తులకు ఫిట్మెంట్ 23 శాతం పెంపు చేసినందుకు ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కు శాలువా కప్పి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని ఉద్యోగులు అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఆదోని పట్టణ అధ్యక్షులు బి. దేవా జిల్లా వాఫ్ బోర్డు చైర్మన్ నియాజ్ అహ్మద్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భాష, స్టేట్ డైరెక్టర్లు అహ్మద్ భాషా అను భాష రామలింగేశ్వర్, జులేఖబీ, శ్రీదేవి, ప్రజ్ఞ సుగుణ, మహేశ్వరి, ఫర్హాద్ భాను శోభలత కౌన్సిలర్లు చలపతి, చిన్న, తదితరులు పాల్గొన్నారు



