కర్నూలు జిల్లా, అదోని..
దేశంలో ప్రతి సంవత్సరం కేంద్ర హోంశాఖ అత్యుత్తమ పని తీరు కనబరిచిన పోలీస్ స్టేషన్లకు ఇచ్చే అవార్డులు జాబితాలో కర్నూలు జిల్లా ఆదోని రూరల్ పోలీస్ స్టేషన్ కు చోటు దక్కడంతో కేంద్ర హోంశాఖకు సంబంధించిన అగ్రి రూరల్ కన్సల్టెన్సీ అధికారి లోకేష్ రెడ్డి ఆదివారం ఆదోని రూరల్ పోలీస్ స్టేషన్ ను పరిశీలించినారు. లోకేష్ రెడ్డి మాట్లాడుతూ 2023 వ సంవత్సరానికి సంబంధించి ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డులకు దేశవ్యాప్తంగా 10 స్టేషన్ ల జాబితాలో, రాష్ట్రవ్యాప్తంగా 3 స్టేషన్ ల జాబితాలో ఆదోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎంపిక అయిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించడం, నేరాలు జరగకుండా ముందస్తు కట్టడి, నేరాలను అదుపులో చేసేందుకు తీసుకున్న అంశాలను పరిశీలించి జాబితాను రూపొందించి కేంద్ర హోంశాఖకు పంపుతామన్నారు. వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదోని రూరల్ సిఐ నిరంజన రెడ్డి, ఎస్ఐ గోపాల్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

