కర్నూలు జిల్లా అదోనిలో తుంగభద్ర ఎల్.ఎల్.సి (లోలెవెల్ కెనాల్) కాలువకు నీళ్లు రావడంతో జలహారతి నిర్వహించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. మున్సిపల్ చైర్ పర్సన్ శాంత పూజలు నిర్వహించి పట్టుచీరను సమర్పించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తిగా నిండిపోతుందని ఇప్పటినుండి ఆదోని పట్టణ ప్రజలకు నీటి సమస్య ఉండదని అయితే కొత్తనీరు వస్తున్నందుకు కాచి వడపోసి త్రాగాలని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ ఇంజనీర్ నాగభూషణం మాట్లాడుతూ 45 రోజులు నీళ్లు పంపిగ్ చేయడంతో ఎస్ఎస్ ట్యాంక్ పూర్తిగా నిండిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్పొరేషన్ డైరెక్టర్ రేణుక, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ నాగభూషణ్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ రాజశేఖర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.