News
హాస్టల్ బాత్రూంలో ప్రసవించిన బాలిక కేసులో విస్తుపోయే వాస్తవాలు
ప్రకాశం జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న 16 ఏళ్ళ బాలిక గర్భం దాల్చింది. అంతేకాదు తాను చదువుకుంటున్న హాస్టల్ బాత్రూమ్‌లో ప్రసవించిన కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ పేరుతో ఒకరు, బెదిరించి మరొకరు, డబ్బుల ఆశచూపి ఇంకొరు ఆమెపై లైంగిక దాడి చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. బాలిక స్వగ్రామంలో జరిగిన ఈ దారుణానికి బాలిక గర్భం దాల్చింది. భయంతో బాలిక ఎవరికీ చెప్పకపోవడంతో 8 నెలలు గర్భాన్ని మోసిన తరువాత తన హాస్టల్‌లోని బాత్రూమ్‌లో శిశువుకు జన్మనిచ్చింది. ట్రంక్ పెట్టెలో మృత శిశువును దాచిపెట్టింది.తరువాత పోలీసులు మార్చూరీకి తరలించారు. బాధితురాలికి వైద్యం అందించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు యువకులను ఫోక్సో చట్టం కింద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు.
కేజీబీవీలో ఔట్‌సోర్సింగ్‌పై ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న జె.సత్యవతి ప్రతిరోజూ విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాల్సి ఉండగా, పాఠశాలలో బాలిక గర్భంతో ఉన్నప్పటికీ ఇద్దరు ఉద్యోగుల తో పాటు గా గర్భం గుర్తించకపోవటంపై ఆమెను కూడా కలెక్టర్ తమీర్ అన్సారియా గారు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు విద్యార్దిని గర్భం దాల్చడానికి దారితీసిన పరిస్థితులపై పోలీసుల విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల విచారణలో సంచలనాలు..
ఈ విషయాన్ని స్థానిక మహిళా పోలీసు ద్వారా కొత్తపట్నం పోలీసులకు తెలియచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో బాలిక స్వగ్రామానికి చెందిన సైదాబాబు ప్రేమ పేరుతో, అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులురెడ్డి, వెంకటరెడ్డిలు బెదిరించి, డబ్బుల ఆశచూపి లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడినట్టు తేల్చారు. ముగ్గురు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్‌పీ ఎఆర్ దామోదర్ తెలిపారు.
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
