Category: News

దేవాలయాలలో చోరీకి పాల్పడుతున్న దొంగ అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని ఇస్వి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ గ్రామాలు  నారాయణపురం, నాగనాతనహళ్లి, మాదిరే గ్రామాల దేవాలయాలలో చోరీకి పాల్పడుతున్న దొంగ బారికి రామన్న ను అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 1,30,000 విలువ చేసె 9 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి కిరీటంను ఇస్వి పోలీసులు స్వాధీనం చేసుకొని దొంగను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కి తరలించరు. ఎస్ఐ నాగేంద్ర తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..ఆదోని మండలం సంతే […]

భోగిమంటల్లో విద్యుత్ బిల్లులు వేసి నిరసన, సిపిఎం..

రాష్ట్ర కమిటీ పిలుపులు భాగంగా కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పాండవగల్లు, కొత్తూరు దొడ్డనకేరి, ఆరెకల్లు, గ్రామాలలో విద్యుత్ బిల్లులను భోగిమంటల్లో వేసి దద్దం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న, కార్యదర్శివర్గ సభ్యులు. రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు  ఎలాంటి కరెంటు చార్జీలు పెంచమని, చార్జీలు, యధావిధిగా కొనసాగిస్తామని ఇచ్చిన మాటను తప్పారని, ఇప్పటికే ప్రజలపై సుమారు 18 వేల కోట్ల రూపాయలు భారం వేసారని, […]

భూమాఫియా పాత్రధారులు దొరికారు మరి సూత్రధారులు ఎక్కడ?

ఆదోని భూమాఫియా పాత్రదారులు సరే! సూత్రదారులను ఎప్పుడు పట్టుకుంటారు? అని ప్రశ్నించారు MHPS మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి  ఎ. నూర్ అహ్మద్..కర్నూలు జిల్లా ఆదోని లో భూమాఫియా చేస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్ లపై ఘాటుగా స్పందించారు MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాత్రధారుల తీగలాగి సూత్రధారుల డొంక కదిలించాలని పోలీస్ అధికారులను కోరారు. భూమాఫియా చేస్తున్న అరాచకాల వల్ల ఆదోనికి చెడ్డ […]

మానవత్వం చాటుకున్న వన్ టౌన్ సిఐ శ్రీరామ్

కర్నూలు జిల్లా ఆదోని శివారు ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో కల్లుబావికి చెందిన తరుణ్ (22)అనే యువకుడికి గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి పడిపోవడంతో. అటువైపు వెళ్తున్న వన్ టౌన్ సిఐ శ్రీరామ్ గమనించి తన వాహనంలో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కల్లుబావి వీధికి చెందిన బిల్డర్ నాగరాజు, జయలక్ష్మిల రెండవ సంతానం తరుణ్ అని స్థానికులు తెలిపారు.

60 కోట్ల అక్రమ రిజిస్ట్రేషన్ కు పాల్పడిన నిందితులు అరెస్టు

కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో ఐదుగురు సబ్ రిజిస్టర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఈరన్న, జూనియర్ అసిస్టెంట్ రమేష్, డాక్యుమెంట్ రైటర్లు మహబూబ్, షబ్బీర్, సాక్షి ఇలియాస్ లను అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ సూర్య మనోహర్ రావు తెలిపారు. నిందితులను ఆదోని కోర్టులో హాజరు పరచచి ఆదోని సబ్ జైలుకు తరలించారు. ప్రధాన నిందితుల కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టిన సీఐ సూర్య మనోహర్ రావు తెలిపారు.ఇప్పటికే ఆదోని సబ్ […]

ఖాకీల కళ్లు కప్పి కోర్టు గోడదూకి పరార్ అయిన దొంగ

అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు కోర్టుకు తరలిస్తుండగా ఖాకీల కళ్లు కప్పి కోర్టు గోడదూకి దొంగ పరారయ్యాడు.కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం త్రీ టౌన్ పరిధిలో బైపాస్ లోని ఓ పాల డెయిరీలో దూరి రూ 10వేల నగదును దొంగలించి కేసులో ముద్దాయిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచడానికి తీసుకెళ్తుండగా పోలీసుల కళ్లు కప్పి కోర్టు ఆవరణంలో గోడదూకి పరారైన ఘటన చోటుచేసుకుంది.  తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మోహినాబాద్ మండలం సూరగాలి గ్రామానికి చెందిన మురళిపై […]

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని  పట్టణం పూల బజారు కు చెందిన శ్వేతా (22 )అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్ ఉరి వేసుకొని  ఆత్మహత్య చేసుకొంది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నరు. భర్త నాగరాజు మృతురాలు శ్వేతా మూడు సంవత్సరాల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నరు. వీరికి రెండేళ్ల కూతురు ఉంది..

కబ్జాలకు పాల్పడితే తాట తీస్తా అన్న ఎమ్మెల్యే ఎక్కడ?

కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతికి అండగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం కూటమి ఎమ్మెల్యే సన్నిహితుడు నకిలీ ఆధార్ కార్డుతో స్థలాన్ని కబ్జా చేసిన విషయం గుర్తు చేశారు. ప్రస్తుతం బ్రతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ […]

ఆటో స్కూటర్ ఢీ నలుగురికి గాయాలు

కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామ సమీపంలో ఆటోను కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అది గమనించిన స్థానికులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు.

నకిలీ పత్రాలు పెట్టండి…. కోట్ల ఆస్తులు సొంతం చేసుకోండి

నకిలీ పత్రాలు పెట్టండి…. కోట్ల ఆస్తులు సొంతం చేసుకోండి అనే చందంగా మారింది ఆదోని సబ్ రిజిస్టర్ కార్యలయం.. ఒకటి మరవక ముందే మరొకటి నకిలీ పత్రాల భాగవతం బయటపడడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన మొదలైంది.. ఇంకా ఇలా ఎన్ని జరిగాయి అని ఆదోని ప్రజలు చర్చించుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కోట్ల విలువ చేసే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని బాధితుడు యగ్గటి ఈశ్వరప్ప సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట కూర్చొని ఆందోళన చేపట్టారు. బతికున్న […]

Back To Top