ఆదోని భూమాఫియా పాత్రదారులు సరే! సూత్రదారులను ఎప్పుడు పట్టుకుంటారు? అని ప్రశ్నించారు MHPS మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి  ఎ. నూర్ అహ్మద్..
కర్నూలు జిల్లా ఆదోని లో భూమాఫియా చేస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్ లపై ఘాటుగా స్పందించారు MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాత్రధారుల తీగలాగి సూత్రధారుల డొంక కదిలించాలని పోలీస్ అధికారులను కోరారు. భూమాఫియా చేస్తున్న అరాచకాల వల్ల ఆదోనికి చెడ్డ పేరు రావడంతో పాటు వ్యాపారంలో కొన్ని వందల కోట్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ మాఫియా వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు తీరని నష్టము కలిగిస్తోందని ప్రభుత్వం దీన్ని ఆషామాషగా తీసుకోకుండా ఆదోనిలో జరిగిన 40 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడంతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్ కు యత్నించిన  నేరస్తులను కఠినంగా శిక్షపడేలా విచారించి వారి కాల్ డేటా మరియు ఇతర వివరాలతో ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను కూడా కటకటాల వెనక్కి పంపాలని  పోలీస్ శాఖను, ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. అలా చేయకపోతే ఆదోని మార్కెట్ కోలుకోవడం కష్టమని ఇది సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను భారీగా దెబ్బతీస్తుందని తెలిపారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్.

యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *