అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు కోర్టుకు తరలిస్తుండగా ఖాకీల కళ్లు కప్పి కోర్టు గోడదూకి దొంగ పరారయ్యాడు.
కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం త్రీ టౌన్ పరిధిలో బైపాస్ లోని ఓ పాల డెయిరీలో దూరి రూ 10వేల నగదును దొంగలించి కేసులో ముద్దాయిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచడానికి తీసుకెళ్తుండగా పోలీసుల కళ్లు కప్పి కోర్టు ఆవరణంలో గోడదూకి పరారైన ఘటన చోటుచేసుకుంది.  తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మోహినాబాద్ మండలం సూరగాలి గ్రామానికి చెందిన మురళిపై ఏపీతోపాటు పక్క రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో దొంగతనాల కేసులు నమోదయ్యాయి ఆదోని టూటౌన్ లో కూడా ఇతనిపై గతంలో దొంగతనం కేసు ఉంది. పోలీసులు రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అంతర్రాష్ట్ర దొంగను కోర్టుకు తరలించే క్రమంలో పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే దొంగ పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్రీటౌన్ సీఐ కి వివరణ కోరితే 41ఏ స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *