కర్నూలు జిల్లా ఆదోని ఇస్వి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ గ్రామాలు నారాయణపురం, నాగనాతనహళ్లి, మాదిరే గ్రామాల దేవాలయాలలో చోరీకి పాల్పడుతున్న దొంగ బారికి రామన్న ను అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 1,30,000 విలువ చేసె 9 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి కిరీటంను ఇస్వి పోలీసులు స్వాధీనం చేసుకొని దొంగను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కి తరలించరు. ఎస్ఐ నాగేంద్ర తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..
ఆదోని మండలం సంతే కుల్లూరు గ్రామంలో శ్రీ అరుడ సిద్దలింగేశ్వర స్వామి మఠములో ఉన్న శ్రీ భీమక్క మాధమ్మ అవ్వల దేవత ల విగ్రహాలపై ఉన్న బంగారు తాళిబొట్లు మరియు బంగారు గుండ్లను, నారాయణపురం గ్రామం శ్రీ రామమ్మదేవాలయములో, నాగనాతనహళ్లి గ్రామం శ్రీ మారెమ్మ దేవాలయంలో, మధిర గ్రామంలో శ్రీ లింగమ్మ అవ్వ దేవతల విగ్రహాల తాళిబొట్లను దొంగిలించిన వ్యక్తి ని మంగళవారం ఉదయం ఆదోని పట్టణం సిరుగుప్ప సర్కిల్ సమీపంలో అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 9 గ్రాముల బంగారు తాళిబొట్లను, 500 గ్రాములు వెండి కిరీటము స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగేంద్ర మీడియా కు తెలిపారు. వీటి విలువ సుమారు 1,30,000/- రూ. ఉంటుందని తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి హోలగుంద మండలం మడ్డి లింగదహళ్లి గ్రామానికి చెందిన బారికి రామన్న గా గుర్తించామని తెలిపారు.