News
40 సం. గా ఉన్నాము పొజిషన్ సర్టిఫికెట్ ఇవండి.
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని. :-

- ఆదోని మండలం మండగిరి గ్రామపంచాయతీకి చెందిన అనీష్ ఫాతిమా సంబంధించి సర్వేనెంబర్ 204/బి 1 నందు 3.70 ఎకరాల భూమికి సంబంధించి ఆన్లైన్ మరియు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
- ఆదోని మండలం కల్లుబావి గ్రామంలో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము సదరు ఇంటి స్థలానికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవు దయతో పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేయవలసినదిగా కల్లుబావికి చెందిన బాలరాజు అర్జీ సమర్పించుకున్నారు.
- టిడ్కో ఇంటి కోసం గతంలో లక్ష రూపాయలు బ్యాంక్ డిడి ద్వారా చెల్లించాము. ప్రస్తుతం మాకు ఎటువంటి టిడ్కో గృహం మంజూరు కాలేదు. దయతో బ్యాంక్ డిడి ద్వారా చెల్లించిన నగదును తిరిగి ఇవ్వవలసినదిగా ఆదోని పట్టణం ఆర్టీసీ కాలనీకి చెందిన దాసరి యశోద అర్జీ సమర్పించుకున్నారు.
- ఆదోని మండలం గోనబావి గ్రామానికి చెందిన పకీరప్ప సంబంధించి 2024 – 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి నా యొక్క కూతురు వెన్నెలకు ఎనిమిదవ తరగతి బదులుగా ఆరవ తరగతి తప్పుగా ఆన్లైన్లో నందు నమోదు చేయడం ద్వారా కస్తూర్బా గాంధీ పాఠశాలలో 8వ తరగతి అడ్మిషన్ మంజూరు కాలేదు. దయతో నాకు కూతురుకు 8వ తరగతి అడ్మిషన్ మంజూరు చేయగలరని అర్జీ సమర్పించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయపు పరిపాలన అధికారి సి. ఆర్. శేషయ్య, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ వేణు సూర్య, డి ఎల్ పి ఓ నూర్జహాన్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సత్యవతి, ఆర్ అండ్ బి ఎక్స్క్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, పంచాయితీ రాజ్ ఎక్స్క్యూటివ్ ఇంజనీర్ వెంకట ప్రసాద్, ఆర్టీవో నాగేంద్ర, డి ఎల్ డి వో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
