News
సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కరువు మండలాలకు రావలసిన 50 రోజుల పని దినాలు వెంటనే కల్పించాలని, కరువు సహాయక చర్యలు భాగంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 14 రకాలు నిత్యవసర సరుకులు ఉచితంగా ఇవ్వాలని, 200 రోజులు పని దినాలు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, కరువు మండలాల్లో కోరుతూ సీజనల్ హాస్టల్స్ ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న అధ్యక్షతన ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో AOకి వినతిపత్రం ఇవ్వాలని ఆయన్ని పిలువగా ఏవో నిర్లక్ష్యంగా ఉండడం వలన సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బందితో వాగ్వాదానికి దిగడం జరిగింది. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం తలుపులకు వినతి పత్రాన్ని అతికించరు. అధికారులకు కనీసం వినతిపత్రం తీసుకునే తీరిక కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు దస్తగిరి, శ్రీరాములు, సురేంద్ర, ఆదోని మండల అధ్యక్షులు రంగనాథ్, దేవనకొండ మండల కార్యదర్శి భాషా, ఆస్పరి మండల కార్యదర్శి రామాంజనేయులు, పెద్దకడూబురు మండల, తుగ్గలి మండల అధ్యక్షులు రంగరాజు అధ్యక్షులు హనుమంతు, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గోపాల్ తిప్పన్న ఉపాధ్యక్షులు లక్ష్మన్న, సిఐటియు మండల కార్యదర్శి బి వీరారెడ్డి, కోసిగి మండల సిఐటియు నాయకులు రాముడు, వ్యవసాయ కార్మిక సంఘం స్థానిక మండల నాయకులు గోవిందు, రహిమాన్, రామప్ప రైతు సంఘం నాయకులు హనుమంత్ రెడ్డి, హనుమంతు పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
