కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం కలెక్టర్ డా.జి.సృజన, ఎస్పీ కృష్ణకాంత్, సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పరిశీలించారు. పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మరియు ఎం ఐ జి లో ఉన్న నేషనల్ స్కూల్, కిడ్డీస్ స్కూల్ పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో ఉండవలసిన సీసీ కెమెరాలు, ర్యాంప్, త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్స్ మొదలగు సదుపాయాలు పక్కాగా ఉండేటట్లు చూసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.