విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి
విద్యుత్ శాఖ ఏడిఈ నాగేంద్రప్రసాద్
కర్నూలు జిల్లా ఆదోని లో 21వ తేదీ మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆదోని విద్యుత్ శాఖ *ఏడిఈ నాగేంద్రప్రసాద్ డి వన్ సబ్ స్టేషన్ ఏఈ నాగభూషణం డి 3 ఏఈ సంతోష్ లు సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపారు.33 కేవీ ఎస్ కే డి ఫీడర్ పెట్రోలింగ్ వర్క్, మెయింటెనెన్స్ లో భాగంగా ఆదోని పట్టణంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు వ్యాపార వర్గాలు గమనించి తమ సంస్థకు సహకరించాలని వారు కోరారు.