కర్నూలు జిల్లా ఆదోని మండలం , పెద్దహరివానం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు బాలురు మృతి చెందంతో గ్రామమంత శోక సంద్రంలో మునిగింది.

మార్చరీ ముందు రోధిస్తున్న బంధువులు


పార్వతి , తుకారం దంపతుల కుమారుడు మంజు (10) అతనితో పాటు అబ్బాస్ అలీ కుమారుడు అక్బర్ అలీ 4 వ తరగతి చదువుతున్నారు. ఈ పిల్లలిద్దరూ సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లి హాజరు వేసుకుని యూరిన్ కని బయటకి వెళ్లారు. ఆ సందర్భంలో పక్కనే ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ప్రమాదవశాత్తు పడి కేకలు వేస్తుండగా దగ్గర్లో ఉన్న స్థానికులు వెళ్లి కాపాడె లోపు అక్బర్ అలీ అనే బాలుడు మృతదేహామై తేలాడు. కొన ఊపిరితో ఉన్న మంజు అనే బాలున్ని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో మృతి చెందాడు. ఇద్దరి మృతదేలను ఆదోని ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మృతి చెందిన చిన్నారులు
యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *