News
ఎస్ ఎస్ ట్యాంక్ లో నీరు నింపకపోతే ఎండాకాలంలో పరిస్థితి ఎలా?
కర్నూలు జిల్లా ఆదోని నీటి సమస్య నివారణకు చర్యలు తీసుకోవాలని సలహాలు, సూచనలతో కూడిన వినతి పత్రం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎ. నూర్ అహ్మద్ మరియు నాయకులు అందజేశారు.
ఈ సందర్భంగా నూర్ అహ్మద్ మాట్లాడుతూ అవినీతి నిర్లక్ష్యముతో కట్టబడిన బసాపురం సమ్మర్ స్టోరేజి ట్యాంకు శిథిలావస్థకు చేరిందని ఆలాగే వదిలేస్తే కట్ట తెగి సమ్మర్ స్టోరేజి ట్యాంక్ అంతమయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు.
ఈ ట్యాంకులో ప్రస్తుత వానాకాలంలో నీరు నింపకపోతే రాబోయే ఎండాకాలంలో ఆదోని ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క వందల ఏళ్ల నాటి రామజల చెరువు నీరు నిండుగా ఉన్నా ఆ నీరు తాగడానికి పనికి రావని మునిసిపల్ చైర్మన్ చెప్పటం మునిసిపాలిటీ అధికారుల, పాలకుల వైఫల్యమే అని అన్నారు.

ఆదోనిలో చీరలు జాకెట్ల రాజకీయం నడుస్తోంది అని రాబోయే రోజుల్లో చీరలు జాకెట్లు ఉతుక్కోవటానికి నీరు దొరకని పరిస్థితి రాబోతుందని నాయకులు గ్రహించాలి అని తెలిపారు.
ఇప్పటికైన పాలకులు, అధికారులు బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును యుద్ధ ప్రాతిపదికన రాతి గోడలతో పటిష్టం చేసి నింపాలని,
రామజల చెరువును శుభ్రపరిచి, పూర్తి స్థాయిలో నింపాలని, కొండలనుంచి చెరువులోకి వచ్చే నీటిని పక్కదారి పట్టకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమములో ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎ. నూర్ అహ్మద్ మరియు కుబేర స్వామి, వసీమ్ సాహెబ్, నరేంద్ర యాదవ్ పాల్గొన్నారు.
News
ఆదోని డివిజన్ APRSA అధ్యక్షుడిగా రజినీకాంత్ రెడ్డి
ఆదోని: కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (APRSA) ఆదోని డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం (జూలై 19న) స్థానిక రెవెన్యూ భవన్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఎన్నికల అధికారి శ్రీ డి. నిజాముద్దీన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. నోటిఫికేషన్ ప్రకారం కొన్ని పదవులకు పోటీ జరగ్గా, మరికొన్ని పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం 2026-2029 కాలానికి గానూ నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు.

నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు:
- ప్రెసిడెంట్: రజినీకాంత్ రెడ్డి (కౌతాళం తహశీల్దార్)
- అసోసియేట్ ప్రెసిడెంట్: జె. బాబు (ఆదోని డిప్యూటీ తహశీల్దార్)
- సెక్రటరీ: వలిబాషా (పెద్దకడుబూరు తహశీల్దార్)
- ట్రెజరర్: రాఘవేంద్ర
- వైస్ ప్రెసిడెంట్లు: రుద్రగౌడ్, జెర్మియా, కౌసర్ భాను
- జాయింట్ సెక్రటరీ: మహేష్
- ఎగ్జిక్యూటివ్ మెంబర్: రామయ్య
- స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ: బి. పెద్దయ్య

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు రెవెన్యూ శాఖ అధికారులు, సహచర ఉద్యోగులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని, సేవా సమస్యల పరిష్కారానికి, రెవెన్యూ శాఖ అభివృద్ధికి మరియు ఉద్యోగుల ఐక్యతకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

News
ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిష్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అధికారులతో ప్రైవేట్ వ్యక్తులతో అనధికారికంగా ఉన్న 1లక్ష 18 వేల 700 వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్సీ సీతారామారావు తెలిపారు.
డీఎస్పీ సీతారామారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో ఈ దాడులు ఆకస్మికంగా నిర్వహించామని అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు నలుగురు అనధికారులు, ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు వారి అసిస్టెంట్లు మరియు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఇద్దరు ప్రవేటు వ్యక్తులు ఉన్నారని వారిని విచారిస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో సీఐ కృష్ణయ్య వారి సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.



News
జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలపై కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలను ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కి తెలుపవచ్చు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

-
News2 weeks agoఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి
-
News2 weeks agoకుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..
-
News2 weeks agoఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు
-
News2 weeks agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News4 weeks agoఅదోనిలో 30 లక్షలు విలువ చేసే 35 బైక్లు స్వాధీనం
-
News2 weeks agoవృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్
-
News1 week agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News2 weeks agoనిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్
