కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్ 2 స్కూటర్లు సీజ్

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం నామాల కొండ సమీపంలో వన్ టౌన్ పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా రెండు స్కూటర్లలో 10 కర్ణాటక బాక్సులలో కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. వన్టౌన్ సీఐ విక్రమ సింహ తెలిపిన వివరాల మేరకు బోయగేరి కి చెందిన రాజేష్, వాల్మీకి నగర్ కి చెందిన బోయ శీను ఉర్ఫ్ చిన్న, బోయ గేరికే చెందిన సూర్య లు ముగ్గురు రెండు లగేజి బ్యాగ్ లలో 10 బాక్సుల కర్నాటక మధ్యం ను తీసుకొని AP 21 F 6763 హీరో హోండా మరియు AP 21 F 5835 బజాజ్ మోటార్ సైకిళ్ల లో ఆదోని టౌన్ లోకి వస్తుండగా వారిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 960 -90 ml ఒరిజినల్ ఛాయస్ విస్కీ tetra pocket లను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్టు సిఐ తెలిపారు.
అక్రమంగా సారాయ్, కర్ణాటక మధ్యం అక్రమ రవాణా , క్రికెట్ బెట్టింగ్ , పేకాట ల గురించి
9121101135 నెంబరు కు సమాచారం అందించాలని సిఐ విక్రమ సింహ కోరారు.
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top