₹100 పెట్టుబడిని ₹2 లక్షలు చేసిన తెలివైన కొడుకు

వ్యాపారం చేయాలంటే లక్షలు, కోట్లు ఉండాల్సిన అవసరం లేదు.. సరైన ఆలోచన ఉంటే చాలు! ఒకే పెట్టుబడితో నలుగురు అన్నదమ్ములు నాలుగు రకాలుగా ఆలోచించి, ఒకరు వందల్లో, మరొకరు ఏకంగా లక్షల్లో ఎలా సంపాదించారో తెలిపే అద్భుతమైన కథ ఇది.

మిస్టర్ షారుక్ అనే వ్యక్తి తన నలుగురు కొడుకులకు వ్యాపారం చేసుకోమని ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున ఇచ్చాడు. ఆ 100 రూపాయలతో ఎవరు ఏం చేశారో చూడండి:

మొదటి కొడుకు సంపాదన ఫోటో

1. మొదటి కొడుకు (సాధారణ పద్ధతి – Organic Growth): మొదటి కొడుకు సేఫ్ గేమ్ ఆడాడు. తనకున్న 100 రూపాయలతో ఒక కోడిని కొన్నాడు. ఆ కోడి రోజుకు ఒక గుడ్డు పెడితే, దాన్ని రూపాయికి అమ్ముతూ సంవత్సరానికి 365 రూపాయలు సంపాదించాడు. (ఇది అందరూ చేసే సాధారణ వ్యాపారం).

రెండవ కొడుకు సంపాదన ఫోటో

2. రెండో కొడుకు (అద్దె విధానం – Lease Financing): రెండో కొడుకు కాస్త తెలివిగా ఆలోచించాడు. 100 రూపాయలతో ఒక్క కోడిని కొనడానికి బదులు, సంవత్సరానికి 20 రూపాయల అద్దె చొప్పున 5 కోళ్లను అద్దెకు (లీజుకు) తీసుకున్నాడు. ఇప్పుడు రోజుకు 5 గుడ్లు వస్తున్నాయి. వాటిని అమ్మి సంవత్సరం చివరికి 1,825 రూపాయలు సంపాదించాడు. (మొదటి వాడి కంటే 5 రెట్లు ఎక్కువ).

మూడవ కొడుకు సంపాదన ఫోటో

3. మూడో కొడుకు (ముందస్తు ఒప్పందం – Mortgage Leveraging): మూడో కొడుకు ఇంకాస్త ముందుకెళ్లాడు. ఇతను కూడా 100 రూపాయలతో 5 కోళ్లను అద్దెకు తీసుకున్నాడు. కానీ, గుడ్లు కొనే వ్యాపారి దగ్గరకు వెళ్లి.. “నేను నీకు రూపాయి గుడ్డును 80 పైసలకే ఇస్తాను, నా అన్నలిద్దరూ గ్యారెంటీగా ఉంటారు, నాకు ఏడాది గుడ్లకు సరిపడా డబ్బు ఇప్పుడే అడ్వాన్స్ ఇవ్వు” అని ఒప్పించి 1,460 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ డబ్బుతో మరో 73 కోళ్లను అద్దెకు తెచ్చి, ఏడాదికి ఏకంగా 22,776 రూపాయలు సంపాదించాడు!

నాలుగవ కొడుకు సంపాదన ఫోటో

4. నాలుగో కొడుకు (భాగస్వామ్యం & బ్యాంక్ లోన్ – Group Leveraging): అందరికంటే చిన్నవాడైన నాలుగో కొడుకు అసలైన బిజినెస్ మైండ్ వాడాడు. తన ముగ్గురు అన్నలను ఒప్పించి, నలుగురి డబ్బులు కలిపి మొత్తం 400 రూపాయలతో పార్ట్‌నర్‌షిప్ మొదలుపెట్టాడు.  ★ ఆ 400 రూపాయలతో 20 కోళ్లను అద్దెకు తీసుకున్నాడు ★ మూడో అన్నలాగే వ్యాపారి దగ్గర 5,840 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని, మరో 292 కోళ్లను అద్దెకు తెచ్చాడు. (మొత్తం 312 కోళ్లు అయ్యాయి) ★ ఇప్పుడు ఆ 312 కోళ్లను బ్యాంకులో తనఖా పెట్టి, వాటి విలువలో సగం అంటే 7,800 రూపాయలు లోన్ తీసుకున్నాడు ★ ఆ లోన్ డబ్బుతో ఇంకో 390 కోళ్లను అద్దెకు తీసుకున్నాడు. ★ మొత్తం 702 కోళ్లతో వ్యాపారాన్ని విస్తరించి, కేవలం 100 రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టిన చిన్న కొడుకు సంవత్సరానికి 2 లక్షల రూపాయలకు పైగా ఆదాయాన్ని సంపాదించాడు!

ఈ కథ నేర్పే నీతి: పెట్టుబడి ఒక్కటే అయినా.. ఆలోచించే విధానం మారితే ఫలితం ఎలా మారుతుందో చూశారా! డబ్బును దాచుకోవడం కంటే, ఉన్న వనరులను (Resources), ఇతరుల డబ్బును (Leverage) సరైన పద్ధతిలో వాడుకోవడమే అసలైన వ్యాపార తెలివితేటలు.