ఆదోనిలో యువకుడి హత్య

ఆదోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖాదర్ బాషా (26) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఖాదర్ బాషాను, తాగిన మత్తులో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో ఆటో డ్రైవర్ రంజాన్ ఇంటి నుంచి మాట్లాడాలని పిలిచి దాడి చేసినట్లు సమాచారం.ఈ దాడిలో ఖాదర్ బాషా ప్రైవేట్ భాగంపై తీవ్రంగా దాడి చేయడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, గతంలో జరిగిన దొంగతనం విషయాన్ని బయటపెట్టాడనే కక్షతోనే ఈ హత్యకు పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
నిందితుడు రంజాన్‌పై గతంలోనే దొంగతనం కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆదోని వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు