ఆదోనిలో టూటౌన్ పీఎస్ ఆవరణలో న్యాయవాదుల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో న్యాయవాదుల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టూటౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

అడ్వకేట్ పై దాడికి పాల్పడుతున్న ఫోటో

స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే… బుధవారం ఓ కేసు విషయమై న్యాయవాది వై.ఎం. మల్లికార్జునపై గుడిగంపల్లి గ్రామానికి చెందిన క్లయింట్ దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితుడు టూటౌన్ పోలీసులకు గుడి కంబాలి గ్రామానికి చెందిన రాజా గౌడ్ శివన్న గౌడ్ తనపై దాడి చేశారని ఫిర్యాదు చేసినప్పటికీ తగిన స్పందన రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన బార్ అసోసియేషన్ న్యాయవాదులు, కేసు నమోదు చేయాలంటూ బుధవారం సాయంత్రం స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.

ఇరువరగాలని పక్కకు లాగేస్తున్న పోలీసులు

ఈ నేపథ్యంలో గురువారం ఆదోనిలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏఎస్పీని కలవడానికి ఇరువర్గాల న్యాయవాదులు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది, బీజేపీ నేత పురుషోత్తం రెడ్డి కూడా ఏఎస్పీకి తమ ఫిర్యాదులు అందజేశారు. అయితే, ఏఎస్పీ స్టేషన్ నుంచి కర్నూలు కు బయలుదేరిన కొద్దిసేపటికి అక్కడికి వై.ఎం. మల్లికార్జున చేరుకున్నరు ఇరు వర్గాలు వెదురుపడడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. పోలీసుల సమక్షంలోనే ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా తీవ్రమై స్టేషన్ బయట, లోపల పరస్పర దాడులకు దారితీసింది. పురుషోత్తం రెడ్డి అతని వర్గీయులు అడ్వకేట్ వై.ఎం. మల్లికార్జున పై దాడికి దిగారు అంతలో అక్కడికి చేరుకున్న మల్లికార్జున కుటుంబ సభ్యులు అడ్వకేట్లు ఆవేశానికి లోనైన న్యాయవాదులు పురుషోత్తం రెడ్డిపై దాడికి దిగడంతో తీవ్ర తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి.

అడ్వకేట్ పై దాడికి పాల్పడుతున్న ఫోటో

పోలీస్ స్టేషన్ ఆవరణలోనే న్యాయవాదులు బాహాబాహీకి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. చట్టాన్ని రక్షించాల్సిన న్యాయవాదులే నడిరోడ్డుపై పరస్పరం దాడులు చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి