కౌతాళం మండలం వల్లూరు లో దారుణం చోటుచేసుకుంది…. అదే గ్రామానికి చెందిన రంగస్వామి అనే యువకుడు ఏడేళ్ల బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు.. బాలిక కు చాక్లెట్, బిస్కెట్, కర్జికాయలు కొనిస్తానని మాయ మాటలు చెప్పి దారుణానికి ఒడి గట్టాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఇంటి వద్ద కు వెళ్లగా రంగస్వామి పరారయ్యాడు….బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. బాధితుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కౌతాళం పోలీసులు తెలిపారు.