News
జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి.. APWJF
ఆదోని 31.07.2026 : రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF) మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (APBJA) ఆదోని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ… సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల రక్షణ, సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మార్చి 4న నిర్వహించిన మహాపదయాత్రలో […]
ఆదోని 31.07.2026 : రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF) మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (APBJA) ఆదోని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ… సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల రక్షణ, సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మార్చి 4న నిర్వహించిన మహాపదయాత్రలో ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు కొన్ని సమస్యలు పరిష్కారమైనప్పటికీ, ప్రధాన సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు.
ముఖ్యమైన డిమాండ్లు: రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ 3 సెంట్ల చొప్పున స్థలాలు కేటాయించాలి. విశాఖపట్నం, హిందూపురం వంటి ప్రాంతాల్లో నిలిచిపోయిన స్థలాల అప్పగింత ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి. గిరిజన ప్రాంత జర్నలిస్టులకు సమీప మైదాన ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణానికి తక్కువ వడ్డీకే రుణాలు, ఆర్థిక సహాయం అందించాలి. జర్నలిస్టుల భద్రత, పని పరిస్థితులు, ఉద్యోగ భద్రతపై అధ్యయనం చేయడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో సీనియర్ జర్నలిస్టులతో ప్రత్యేక మీడియా కమిషన్ ఏర్పాటు చేసి 6 నెలల్లో నివేదిక తెప్పించాలి.
ఇతర రాష్ట్రాల తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమల్లోకి తీసుకురావడానికి అధ్యయన కమిటీని నియమించాలి. దాదాపు 50 ఏళ్లుగా ప్రచురితమై, ఇటీవల నిలిచిపోయిన ప్రభుత్వ ‘ఆంధ్రప్రదేశ్’ మాసపత్రిక ముద్రణను వెంటనే పునరుద్ధరించాలి. నూతనంగా ఏర్పడిన 28 జిల్లాల అవసరాలకు అనుగుణంగా సమాచార పౌరసంబంధాల శాఖను ఆధునీకరించి, తగినంత సిబ్బందిని నియమించాలి.జర్నలిస్టులందరికీ ఏసీ బస్సులతో సహా అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత/రాయితీ ప్రయాణ సౌకర్యాన్ని, అలాగే రైల్వే పాస్‌ల మంజూరు ప్రక్రియను సులభతరం చేయాలి. జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 50 కోట్లతో ‘జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్’ ను పునరుద్ధరించాలి. దాడులను అరికట్టేందుకు హోంశాఖ మంత్రి నేతృత్వంలో హైపవర్ కమిటీ, జిల్లా స్థాయిలో పోలీస్ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలి. సి. రాఘవాచారి మీడియా అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ నియమించి వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. నిలిచిపోయిన రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ అవార్డులను ప్రతి ఏటా ప్రదానం చేయాలి. అసంగతిత రంగానికి ఇచ్చే బీమా సదుపాయాన్ని జర్నలిస్టులకు వర్తింపజేయాలి. వయోవృద్ధులైన జర్నలిస్టుల సామాజిక భద్రత కోసం రాష్ట్ర కేంద్రంలో ప్రత్యేక వృద్ధాశ్రమం నిర్మించాలి.
ఈ కార్యక్రమంలో APWJF అధ్యక్షులు, కార్యదర్శులు, ఈసీ సభ్యులు మరియు ఆదోని డివిజన్‌కు చెందిన పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
News
ఆదోని విశ్వనారాయణ కళాశాల ఎదుట PDSU ధర్నా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విశ్వనారాయణ కళాశాల ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు అఖండ, మండల అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విశ్వనారాయణ కళాశాల యాజమాన్యం ఒకే భవనంలో ఇంటర్, ఒకేషనల్, పల్లవి పారామెడికల్ కళాశాలలను నడుపుతోందని మండిపడ్డారు. పారామెడికల్ కళాశాలకు అనుమతిఎస్.కె.డి కాలనీ చిరునామాతో పొంది, అధికారుల కళ్లు గప్పి విశ్వనారాయణ కాలేజీ బిల్డింగ్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పారామెడికల్ బోర్డు అనుమతి పత్రం (పర్మిషన్ బోర్డు) కూడా లేకుండానే విద్యార్థుల వద్ద భారీగా ఫీజులు వసూలు చేశారని తెలిపారు. కాలేజీ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు తరగతులు ప్రారంభించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.
అంతేకాకుండా తరగతులు జరుగుతున్న సమయంలోనే అదే భవనంపై నిర్మాణాలు (కన్స్ట్రక్షన్) చేపడుతున్నారని, దీనివల్ల విద్యార్థులకు ఏమైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న విశ్వనారాయణ కళాశాలపై ఇంటర్మీడియట్ బోర్డు, ఏపీ పారామెడికల్ బోర్డు అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పి.డి.ఎస్.యు మండల నాయకులు బసవ, విష్ణు, ముని, గోవర్ధన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోనికి 6 కొత్త ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు
కర్నూలు జిల్లా ఆదోని ఎంసిహెచ్ (MCH) ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మంగళవారం నూతనంగా మంజూరైన 102 ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాల ను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి రిబ్బన్ కట్ చేసి నూతన వాహనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదోని నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం మొత్తం 6 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ నూతన వాహనాలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. కర్నూలు జిల్లాలోనే అత్యధిక ప్రసవాలు జరిగే ఆసుపత్రుల్లో ఆదోని ఎంసిహెచ్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రసవం అనంతరం బాలింతలను, పసిపాపలను సురక్షితంగా, ఉచితంగా ఇంటికి చేర్చేందుకు ఈ వాహనాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని తల్లులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంసిహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు లలితమ్మ, రేణు వర్మ, నాయకులు ఉపేంద్ర కుమార్, మధుసూదన్ శర్మ, ప్రశాంత్ కుమార్, వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
News
ఆదోని జిల్లా సాధన రిలే నిరాహార దీక్ష తాత్కాలిక విరామం
కర్నూలు జిల్లా అదోనిలో గత 269 రోజులుగా ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు తాత్కాలికంగా విరామం లభించింది. ఆదోని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కే. మీనాక్షి నాయుడు విజ్ఞప్తి మేరకు జేఏసీ నాయకులు దీక్షా శిబిరాన్ని విరమించి వేదికను తొలగించారు.
దీక్ష విరమణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడుతూ — రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, సాంకేతిక అంశాల దృష్ట్యా తక్షణమే కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు ఆమోదం పొందిన వెంటనే, కొత్త నియోజకవర్గాలు మరియు జిల్లాల సంఖ్య పెరుగుతుందని ఆ సమయంలో ఆదోనిని జిల్లాగా ప్రకటించే అంశాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని లోకేష్ మరియు ఇన్‌చార్జ్ మంత్రి హామీ ఇచ్చారని మీనాక్షి నాయుడు వెల్లడించారు.
జేఏసీ ప్రతినిధులు వై.పి. నాగరాజ్, సుజ్ఞానమ్మ, దేవశెట్టి ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ — గత 269 రోజులుగా పశ్చిమ కర్నూలు ప్రాంత ప్రజల కాంక్ష మేరకు సాగిన ఈ ఉద్యమానికి ఆదోనితో పాటు ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని జేఏసీ నాయకులు గుర్తుచేశారు. కుల, మత, రాజకీయ పార్టీల అతీతంగా వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, పత్రికా ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాలు ఈ దీక్షలకు పూర్తి మద్దతు తెలిపారుఅని ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం కాదని 77 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పశ్చిమ ప్రాంత సమగ్ర అభివృద్ధి, మెరుగైన వైద్యం, తాగు/సాగు నీటి లభ్యత కోసమే ఈ పోరాటం ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా 269 రోజుల పాటు ఉద్యమానికి సహకరించిన ప్రజలకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా ప్రతినిధులకు జేఏసీ నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
-
News4 weeks ago
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News2 weeks ago
ఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు
-
News4 weeks ago
BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు
-
News2 weeks ago
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయం..
-
News3 weeks ago
ఆదోనిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ
-
News3 weeks ago
ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
-
News3 weeks ago
జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన
-
News4 days ago
ఆదోని నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం