ఆదోని సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు 95% ప్రాపర్టీ రికవరీ చేసినట్లు ఆదోని డీఎస్పీ సోమన్న తెలిపారు.
కర్నూలు జిల్లా ఆదోని 1 టౌన్ పోలీసులు అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన గోవిందరాజులు, చిన్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్దనుండి సుమారు 6 లక్షల 40 వేల రూపాయల విలువచేసే 80 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 లక్ష 76 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి సోమన్న విలేకరులతో మాట్లాడుతూ ఆలూరు కు చెందిన గోవిందరాజులు డోన్ కు చెందిన ఎరుకల చిన్ని గా గుర్తించామని మరో ఇద్దరు దొంగలు పరరీలో ఉన్నారని తెలిపారు. ఈ దొంగల ముఠా కర్నూలు, నంద్యాల, అనంతపురం, నెల్లూరు జిల్లాలో దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాపర్టీ రికవరీ చేయాలని ఎస్పీ గారి ఆదేశాలతో ఆదోని సబ్ డివిజన్ పరిధిలో 95% పూర్తి చేసినట్లు తెలిపారు.