కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆర్టీఓ అధికారులమంటూ వాహన దారుల వద్ద వసూళ్లుకు పాల్పడిన ఇద్దరూ నిందితులు అశోక్ కుమార్ (27), వినోద్ (28) లను అరెస్ట్ చేసిన వన్ టౌన్ సిఐ సీఐ శ్రీరామ్.
వన్ టౌన్ సిఐ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..
ఆర్టీఓ లమని వసూళ్లకు పాల్పడుతున్న ముద్దాయిలను శుక్రవారం ఉదయం 11 గంటల 40 నిమిషాలకు తిమ్మారెడ్డి బస్టాండ్ వద్ద ఆదోని పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన అశోక్ కుమార్ వయస్సు 27 సం. మరియు ఆదోని పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన పొట్లపాడు వీరేష్, వయస్సు 28 సం.  వీరిద్దరిని ముద్దాయిలుగా గుర్తించి అరెస్టు చేశారు.  వీరిపై PS Cr. No. 105/2024 U/s 308(3),319(1), 126(2),204, 115(2),324(4) BNS of Adoni I Town PS కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.

వన్ టౌన్ సిఐ శ్రీరామ్

వివరాలు ఇలాఉన్నాయి.
సోమవారం 07.10.2024 వ తేదీ రాత్రి  11:30 గంటలప్పుడు కేరళ రాష్ట్రానికి S. సుబీష్ (40) లారీ డ్రైవరు, క్లీనర్ వినోద్ తో కలసి KA 01 AJ 9676 రిజిస్ట్రేషన్ నంబర్ గల లారిలో తాండూర్ నుంచి నాపరాయి ని లోడుతో ఆదోని టౌన్ లోని కొత్త బ్రిడ్జ్ సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పై నిలబడి లారీని ఆపి తాళాలు తీసుకుని మేము RTO అధికారులము అని, లారీ రికార్డ్స్ చెక్ చేయాలని చెప్పి బెదిరించి, లారీ విడిచిపెట్టాలి అంటే లక్ష రూపాయలు ఫోన్ పే చేయాలి అని డిమాండ్ చేశారని సిఐ తెలిపారు. అంత డబ్బు లేదు అన్నందుకు క్లీనర్ వినోద్ ఫోను తీసుకొని కిందకు పడేయడంతో, సెల్ ఫోన్ పగిలి డిస్ప్లే పోయినది. ఆ యిద్దరూ వారిపై దౌర్జన్యం చేస్తూ చేతులతో చెంపమీద, మెడమీద కొడుతుండగా డ్రైవరు మరియు క్లీనరు వారి నుండి తప్పించుకొవడానికి గట్టిగా కేకలు వేశారు అటువైపు వెళ్ళే వారు గుమ్మికూడడంతో వారు అక్కడినుండి పారి పోయారని  డ్రైవర్ సుభీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ శ్రీ రామ్ కేసు నమోదు చేసామని తెలిపారు.

ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *