News
వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ ఆర్టీఓ లు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆర్టీఓ అధికారులమంటూ వాహన దారుల వద్ద వసూళ్లుకు పాల్పడిన ఇద్దరూ నిందితులు అశోక్ కుమార్ (27), వినోద్ (28) లను అరెస్ట్ చేసిన వన్ టౌన్ సిఐ సీఐ శ్రీరామ్.
వన్ టౌన్ సిఐ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..
ఆర్టీఓ లమని వసూళ్లకు పాల్పడుతున్న ముద్దాయిలను శుక్రవారం ఉదయం 11 గంటల 40 నిమిషాలకు తిమ్మారెడ్డి బస్టాండ్ వద్ద ఆదోని పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన అశోక్ కుమార్ వయస్సు 27 సం. మరియు ఆదోని పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన పొట్లపాడు వీరేష్, వయస్సు 28 సం. వీరిద్దరిని ముద్దాయిలుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరిపై PS Cr. No. 105/2024 U/s 308(3),319(1), 126(2),204, 115(2),324(4) BNS of Adoni I Town PS కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.

వివరాలు ఇలాఉన్నాయి.
సోమవారం 07.10.2024 వ తేదీ రాత్రి 11:30 గంటలప్పుడు కేరళ రాష్ట్రానికి S. సుబీష్ (40) లారీ డ్రైవరు, క్లీనర్ వినోద్ తో కలసి KA 01 AJ 9676 రిజిస్ట్రేషన్ నంబర్ గల లారిలో తాండూర్ నుంచి నాపరాయి ని లోడుతో ఆదోని టౌన్ లోని కొత్త బ్రిడ్జ్ సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పై నిలబడి లారీని ఆపి తాళాలు తీసుకుని మేము RTO అధికారులము అని, లారీ రికార్డ్స్ చెక్ చేయాలని చెప్పి బెదిరించి, లారీ విడిచిపెట్టాలి అంటే లక్ష రూపాయలు ఫోన్ పే చేయాలి అని డిమాండ్ చేశారని సిఐ తెలిపారు. అంత డబ్బు లేదు అన్నందుకు క్లీనర్ వినోద్ ఫోను తీసుకొని కిందకు పడేయడంతో, సెల్ ఫోన్ పగిలి డిస్ప్లే పోయినది. ఆ యిద్దరూ వారిపై దౌర్జన్యం చేస్తూ చేతులతో చెంపమీద, మెడమీద కొడుతుండగా డ్రైవరు మరియు క్లీనరు వారి నుండి తప్పించుకొవడానికి గట్టిగా కేకలు వేశారు అటువైపు వెళ్ళే వారు గుమ్మికూడడంతో వారు అక్కడినుండి పారి పోయారని డ్రైవర్ సుభీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ శ్రీ రామ్ కేసు నమోదు చేసామని తెలిపారు.

News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
