కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి శుక్రవారం మంత్రి నారా లోకేష్ ని కలిసారు.
ఆదోని నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వలసకు పోతుంటారని. చదువుకునే పిల్లల్ని తీసుకుపోవడం వల్ల వాళ్ళ విద్యాభ్యాసం మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉన్నందున వీరి కోసం వీరి పిల్లల కోసం చదువు పాడవకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయాలని – కస్తూరిబా స్కూల్స్ , AP మోడల్ స్కూల్స్ , అలాగే జ్యోతి రావ్ పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరారు.
అదే సందర్భంలో వాల్మీకి కులస్తులని ఎస్టీ జాబితాలో చేర్చడం , మాదాసి కురవలకు ఎస్సీ సర్టిఫికెట్ల మీద ప్రత్యేకంగా చర్చించరు. ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే లెటర్ పై రాతపూర్వకంగా వినతి పత్రం అందజేశారు దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ తప్పక తగిన చర్యలు తీసుకుంటానని హామీ వచ్చినట్లు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి మీడియాకు సమాచారం అందించారు.

మంత్రి నారా లోకేష్ కు వినతిపత్రం అందజేస్తున్న ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *