కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం ముస్లిం మైనార్టీలు షాహి జామియా మజీద్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మొహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం అందజేత. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మైనార్టీ నాయకులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.