కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా డిఐజి ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ వినాయక నిమజ్జనం రోజు చెప్పిన సమయానికి కరెక్ట్ గా విగ్రహంలతో బైలుదేరాలని సూచించారు. పండగని పండగలా చేసుకుందాం ఎవరు లైను దాటోద్దు, అందరూ సంతోషంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సిఐ శ్రీరాములు మాట్లాడుతూ వినాయక విగ్రహాలకు వెళ్ళడానికి రూట్ మ్యాప్ ఖరారు చేసినట్లు తెలిపారు. ఎమ్మిగనూరు సర్కిల్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా వెళ్ళేటట్లు పోలిస్ శాఖ నిర్ణయించామని అన్నారు.
పీస్ కమిటీ సమావేశంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు, ఆదోని డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ప్లీజ్ కమిటీ మీటింగ్ లో మాట్లాడుతున్న సీఐ శ్రీరాములు
పీస్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మత పెద్దలు
వీడియో చూడాలంటే దీన్ని క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *