ఆదోని నియోజకవర్గలోని గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారంగా మధ్యాహ్న భోజనం పెట్టని స్కూల్లలో వంట ఏజెన్సీ లపై చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్కు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ కొన్ని ప్రభుత్వ పాఠశాలలో మెనూ ప్రకారంగా అన్నం పెట్టకుండా విద్యార్థుల కడుపు కొడుతున్న వంట ఏజెన్సీ లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి లేని లేనిపక్షంలో డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులకు హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను ప్రకారం మెనూలో ఉన్నట్లు పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు డివిజన్ అధ్యక్షుడు నవీన్ మండల అధ్యక్షుడు వినీల్ మనోజ్ పవన్ తదితరులు పాల్గొన్నారు.

సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మాట్లాడుతున్న డిఎస్ఎఫ్ నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *