కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామంలో సర్పంచ్ జయమ్మ పై అదే గ్రామానికి చెందిన తలారి నరసింహులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాలుక పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి 11:30 కు ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసి ఇంతవరకు నిందితుడు నరసింహులు ను పోలీసులు అరెస్టు చేయకపోవడంతో జయమ్మ బంధువులు మరియు సర్పంచ్ సంఘ నాయకులు సర్పంచులు ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు.

నిందితున్ని అరెస్టు చేయాలని స్టేషన్ ముందు బైఠాయించిన బంధువులు

నిందితుడు తలారి నరసింహులును అరెస్ట్ చేయాలని స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. అరెస్ట్ చేయక పోతే ఎస్పీ , హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తానని సర్పంచ్ సంఘాలు హెచ్చరించారు. కేసు నమోదు చేయడం లో నిర్లక్ష్యం వహించిన ఎస్సై ఎర్రిస్వామిని సస్పెండ్ చేయాలని సర్పంచ్ జయమ్మ బందువులు, సర్పంచ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

సీఐ నిరంజన్ రెడ్డితో చర్చిస్తున్న సర్పంచ్ సంఘ నాయకులు

సిఐ నిరంజన్ రెడ్డి కలగజేసుకుని ఎస్సై ఎర్రి స్వామి పై విచారణ చేసి పై అధికారులకు నివేదిక అందిస్తామని అదేవిధంగా నిందితుడు నరసింహులుని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరచి జయమ్మకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో జయమ్మ బంధువులు బంధువులు సర్పంచ్లు శాంతించారు.

నిందితున్ని అరెస్టు చేయాలని స్టేషన్ ముందు బైఠాయించిన మహిళలు
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన బాధ్యత కుటుంబ సభ్యులు
యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *