కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం బసాపురం ఎల్ఎల్సీ కాలువకు తుంగభద్ర దిగువ కాలవ నుండి కొత్తగా నీరు రావడంతో జలహారతి నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పలుగొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ పట్టణంలో త్రాగినీటి సమస్య లేకుండా చేస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా గంగా హారతి కార్యక్రమం నిర్మావహిచమన్నారు.
ఎస్ ఎస్ ట్యాంకు 60 శాతం కంటే ఎక్కువగా నింపాడానికి ఇబ్బందిగా ఉన్నందువల్ల, నిధులు మంజూరు కు మున్సిపల్ కౌన్సిల్ లో బిల్ పెట్టి నిధులు తీసుకొచ్చి త్వరితగతిన SS ట్యాంకు పనులు పూర్తి చేసి ఆదోని ప్రజలకు త్రాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోయ శాంత, మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.