కర్నూలు జిల్లా ఆదోని ఉదయం సుమారు 7.30 నిమిషాల కు ట్రైన్ No 12163లో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న బోయ నాగరాజు (19 సం.) అను వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకొని అతని నుండి 45 వేల రూపాయల విలువగల 900 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. RPSI గోపాల్ తెలిపిన వివరాల మేరకు కడితోట గ్రామానికి చెందిన బోయ వెంకటేష్ కుమారుడు బోయ నాగరాజు ట్రైన్ నుండి కర్ణాటక ఒరిజినల్ ఛాయిస్ tetra ప్యాకెట్లు గల బ్యాగులు పెట్టుకొని దిగుతుండగా, RPSI రామస్వామి,. RPSI గోపాల్ ఆదోని RPS, RPF ASI వీరేశ, సిబ్బంది కలిసి పట్టుకొని తనిఖీలు చేయగా అతని వద్ద నుండి 45 వేల రూపాయల విలువగల 900 tetra ప్యాకెట్లు స్వాధీన చేసుకొని పై అధికారుల ఆదేశాల మేరకు ఆదోని SEB ఇన్స్పెక్టర్కు అప్పగించమని తెలిపారు.