కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని అదేవిధంగా ఈ స్టాంప్ అధిక రేట్లు అమ్ముతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం స్టాంపులు నిర్ణీత ధరలకే విక్రయించాలని సబ్ రిజిస్ట్రార్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు అజయ్ బాబు, సుదర్శన్, వీరేష్ మాట్లాడుతూ ఈ స్టాంపులను అధిగ ధరలకు అమ్ముతున్నారని ప్రజలు తమ పార్టీ కార్యాలయం కొచ్చి ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. ఈ స్టాంపులు అధిక ధరలకు అమ్మవారి పై చర్యలు తీసుకోవాలని మరియు రిజిస్ట్రేషన్ సమయంలో అక్రమ వసూళ్లు లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని సీపీఐ నాయకుల హెచ్చరించారు.