కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ట్రాఫిక్ తీవ్రంగా పెరగడంతో వాహనదారులకు, పాదచారులకు అనేక సమస్యలు ఎదురువుతున్నాయి. అది గణించిన పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా బీమా సర్కిల్ నుండి శ్రీనివాస భవన్ వరకు ఇరువైపులా రోడ్డు మీద అడ్డంగా ఉన్న తోపుడుబండ్లు మరియు షాపుల యొక్క నేమ్ ప్లేట్స్ ఇతర టీ స్టాల్స్ అన్నీ కూడా వెనక్కి పెట్టించి వ్యాపారస్తులను ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు.