కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ రైల్వే స్టేషన్ కౌతాలం మండలాల సరిహద్దులలో ఉన్న ఎరిగేరి గ్రామాల మధ్య ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొరకు స్థల సేకరణ నిమిత్తం స్థల ప్రదేశాలను క్షేత్రస్థాయిలో ఆదోని, కౌతాలం రెవెన్యూ అధికారులు మరియు రైల్వే అధికారులతో కలిసి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శివ రాముడు, రజినీకాంత్ రెడ్డి, రైల్వే ఇంజనీర్ ఉమాపతి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



