కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఊరుకుంద గ్రామంలో శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన పరిపాలన కార్యాలయంలో ఫిబ్రవరి మాసంలో జరిగే కుంభాభిషేక మహోత్సవం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆదోని శుక్ర మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించరు. అనంతరం గ్రామంలో పార్కింగ్ స్థల ప్రాంతాలను పరిశీలించి అధికారులతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి ఉపేంద్ర, ఈవో విజయరాజు, తహశీల్దారు రజినీకాంత్ రెడ్డి, డి.ఎల్.పి.వో నూర్జహాన్, ఆర్ అండ్ బి డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



