Day: January 7, 2025

మానవత్వం చాటుకున్న వన్ టౌన్ సిఐ శ్రీరామ్

కర్నూలు జిల్లా ఆదోని శివారు ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో కల్లుబావికి చెందిన తరుణ్ (22)అనే యువకుడికి గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి పడిపోవడంతో. అటువైపు వెళ్తున్న వన్ టౌన్ సిఐ శ్రీరామ్ గమనించి తన వాహనంలో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కల్లుబావి వీధికి చెందిన బిల్డర్ నాగరాజు, జయలక్ష్మిల రెండవ సంతానం తరుణ్ అని స్థానికులు తెలిపారు.

60 కోట్ల అక్రమ రిజిస్ట్రేషన్ కు పాల్పడిన నిందితులు అరెస్టు

కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో ఐదుగురు సబ్ రిజిస్టర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఈరన్న, జూనియర్ అసిస్టెంట్ రమేష్, డాక్యుమెంట్ రైటర్లు మహబూబ్, షబ్బీర్, సాక్షి ఇలియాస్ లను అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ సూర్య మనోహర్ రావు తెలిపారు. నిందితులను ఆదోని కోర్టులో హాజరు పరచచి ఆదోని సబ్ జైలుకు తరలించారు. ప్రధాన నిందితుల కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టిన సీఐ సూర్య మనోహర్ రావు తెలిపారు.ఇప్పటికే ఆదోని సబ్ […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు

తేదీ 07-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7509/- రూపాయలు కనిష్ట ధర ₹. 5080/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5797/- రూపాయలు కనిష్ట ధర ₹. 3179/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5650/- రూపాయలు కనిష్ట ధర ₹.5296/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5455/- రూపాయలు కనిష్ట ధర ₹.5081/- […]

ఖాకీల కళ్లు కప్పి కోర్టు గోడదూకి పరార్ అయిన దొంగ

అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు కోర్టుకు తరలిస్తుండగా ఖాకీల కళ్లు కప్పి కోర్టు గోడదూకి దొంగ పరారయ్యాడు.కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం త్రీ టౌన్ పరిధిలో బైపాస్ లోని ఓ పాల డెయిరీలో దూరి రూ 10వేల నగదును దొంగలించి కేసులో ముద్దాయిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచడానికి తీసుకెళ్తుండగా పోలీసుల కళ్లు కప్పి కోర్టు ఆవరణంలో గోడదూకి పరారైన ఘటన చోటుచేసుకుంది.  తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మోహినాబాద్ మండలం సూరగాలి గ్రామానికి చెందిన మురళిపై […]

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని  పట్టణం పూల బజారు కు చెందిన శ్వేతా (22 )అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్ ఉరి వేసుకొని  ఆత్మహత్య చేసుకొంది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నరు. భర్త నాగరాజు మృతురాలు శ్వేతా మూడు సంవత్సరాల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నరు. వీరికి రెండేళ్ల కూతురు ఉంది..

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 07 01 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78800-001 గ్రాములు సుమారు రూ. 7880-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 73020-001 గ్రాములు సుమారు రూ. 7302-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 918-00

Back To Top
Exit mobile version