రైతుల సొంత భూములను రైల్వే భూములుగా ఎలా చూపిస్తారు

కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో రెవెన్యూ అధికారులు రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రైతు సదస్సులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షుడు కే. శేఖర్ మరియు రైతులు రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ పెద్దయ్యకు రీ సర్వేలో భాగంగా  రైతుల సొంత భూములను రైల్వే భూములుగా చూపించి, రైతు పేర్లు ఆన్లైన్ నుండి తొలగించారని వారి పేర్లను ఆన్లైన్లో చేర్చి, వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ తాసిల్దార్ పెద్దయ్య మాట్లాడుతూ మాకు 30 రోజులు వ్యవధి కావాలని ఆలోగా సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రైతు సంఘం అధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతూ 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతులు సుభాన్, బోజప్ప, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version