రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో భాగంగా
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీసార్ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీ శివ నారాయణ స్వామి ఆదేశాల మేరకు రాబడిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా ముంబై కి చెందిన డానియల్ జైన్ అను వ్యక్తి వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న సుమారు 50 లక్షల 13 వేల 508 రూపాయల 785.446 గ్రాముల బంగారము ఆభరణాలను సీజ్ చేశారు ట్రైనింగ్ డిఎస్పి వి.ధీరజ్ తెలిపారు. సీజ్ చేసిన బంగారాన్ని ఎఫ్ ఎస్ టి టీమ్ వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలలో ఇన్స్పెక్టర్ ఎస్. తేజ మూర్తి, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.