కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ సహాయ సంచాలకులు వారి కార్యాలయంలో శుక్రవారం ఆదోని డివిజన్ పరిధిలోని  గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు విస్తరణ అధికారుల కు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పత్తి, వేరుశనగ, శనగ పంటలలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రస్తుత పంటలలో ఎదుర్కొంటున్న తెగుళ్లు పురుగుల నివారణ చర్యలు గురించి తెలియజేశారు.

శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సేవ కేంద్రముల సిబ్బంది

ఈ కార్యక్రమంలో , ఏరువాక కేంద్రం కర్నూలు ప్రధాన శాస్త్రవేత్త Dr. K. సుజాత, ఆదోని సహాయ వ్యవసాయ సంచాలకులు Dr. K. అరుణ కుమారి, కర్నూలు జిల్లా వనరుల కేంద్రం ADA ఎం. గిరీష్, ఆదోని మండల వ్యవసాయ అధికారి సి. అశోక్ కుమార్ రెడ్డి మరియు డివిజన్ లోని గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న కర్నూలు జిల్లా వనరుల కేంద్రం ADA ఎం. గిరీష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *