కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం లో కన్న తండ్రి అని కనకరం లేకుండా కొడుకులు చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. మంత రాజు(60) వృద్ధుడిని తన సొంత కొడుకులే కన్న తండ్రిని దయ దక్షిణం లేకుండా ఇద్దరు కొడుకులు రక్తం గాయాలయ్యాల చితకబాధరు.
స్థానికుల తెలిపిన వివరాల మేరకు.. ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు నీలకంఠ, చిన్న కొడుకు రాజేష్ వివాహం చేయడం లేదని ఇద్దరు కుమారులు కలిసి తండ్రి పై దాడి చేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. రెండు కాళ్లు విరిగి రక్త గాయాలు కావడంతో అది గమనించిన స్థానికులు హుటాహుటిన గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.