కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరామ్ అంతరాష్ట్ర దొంగలముఠాను అరెస్టు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ముందు హాజరు పరిచారు. 13 మందిని అరెస్టు చేసి వీరి వద్ద నుండి భారీగా ప్రాపర్టీని రికవరీ చేశారు. ఈ ముఠా నుంచి 21 కేసులలో దొంగలించబడిన 478.7 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ. 33 లక్షల 7 వేల 8 వందల విలువ)  రూ. 8 లక్షల 4 వేల నగదు మొత్తము సుమారు రూ.41 లక్షల, 11 వేల, 8 వందల ప్రాపర్టీ  స్వాధీనం చేసుకున్నరు.

దొంగల ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు

ప్రాపర్టీ రికవరీలో ప్రతిభ కనబరచిన ఆదోని ఒకటవ పట్టణ సిఐ శ్రీరామ్, ఎస్సై రామస్వామి , పోలీసుసిబ్బందిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ అభినందించి, రివార్డులు అందజేశారు.

దొంగల ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న నగదు
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వాధీనం చేసుకున్న నగదును వివరిస్తున్న డి.ఎస్.పి సీఐ
మీడియా ముందు నగదును ప్రదర్శించిన ఎస్పీ
పోలీసులకు రివార్డులు అందజేస్తున్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *