ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థి సంఘాల పోరాట ఫలితం.. ఎదురుచూస్తున్న విద్యార్థుల కల నెరవేరింది ..
కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రారంభమైందని 2023-24 సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె మహబూబ్బాషా తెలిపారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులు తమ పేర్లను ఆన్లైన్లో www.apsehe.ap.gov.in వెబ్సైట్ ద్వారా తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. విద్యార్థుల సదుపాయం కోసం హెల్ప్ డిస్క్లను ఏర్పాటు చేశామని 9966487917, 9985385255 నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ కె మహబూబ్ బాషా తెలిపారు.



