కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మరియు కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదోని లో పర్యటించారు. ముందుగా శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుడి పెద్దలు దేవాలయంలో తీర్థ, ప్రసాదాలు అవ్వ వారి శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్చితలు ఆశీర్వాదించారు. అనంతరాం రాష్ట్రంలో అతి పురాతన షాహి జామియా మసీదును సందర్శించారు. అనంతరం ఖతీబ్ జునైద్ హష్మీ ప్రత్యేక ప్రార్థనలు చేసి మజీద్ పెద్దలు జిల్లా ఎస్పీ ను మరియు ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ని శాలువా మరియు పూలమాల తో సన్మానించారు.
అక్కడి నుండి జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదోని మున్సిపల్ కార్యాలయం మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్లో జూన్ 29న జరిగే బక్రీద్ పండుగ సందర్భంగా ఆయా మత పెద్దల తో పీస్ (శాంతి) కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ శాంత, ఆదోని డీఎస్పీ శివ నారాయణ, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శిశిర దీప్తి, తహశీల్దారు వెంకటలక్ష్మి, తదితరులు అధికారులు పాల్గొన్నారు.



