సీఎం జగన్మోహన్ రెడ్డి మాటిస్తే మాట తప్పరు.
ఆదోనికి డిగ్రీ కాలేజ్ ఇస్తానని ఇచ్చి హామీ పూర్తి చేశారు.. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
కర్నూలు జిల్లా అదోని లో ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ 2023-24 అకడమిక్ ఇయర్ కు అనుమతులు మంజూరు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు విద్యార్థి సంఘాలు పోరాటం చేసిన ఫలితం అన్నారు గత చంద్రబాబు హయాంలో హామీలకె పరిమితమయ్యారని డిగ్రీ కాలేజీ ఇస్తామని ప్రజలతో ఓట్లు వేయించుకొని డిగ్రీ కాలేజ్ విషయాన్ని గాలికి వదిలేశారని తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆదోని పేద ప్రజలకు అందించారని తెలిపారు.
అనంతరం డిగ్రీ కాలేజ్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మహబూబ్ బాషా మరియు లెక్చరర్లు బాలికల జూనియర్ కాలేజ్ ను డిగ్రీ కాలేజ్ కోసం మౌలిక సదుపాయాలు, వసతుల కోసం పర్యవేక్షించారు. ప్రిన్సిపల్ మహబూబ్ బాషా మాట్లాడుతూ నూతన భవనం పూర్తి అయ్యేంతవరకు బాలికల జూనియర్ కాలేజీలోనే డిగ్రీ కాలేజ్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపిన కోరారు.



