కర్నూలు జిల్లా ఆదోని బసాపురం రోడ్లో ఉన్న సంతోష్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ పత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిలిందంటూ ఫ్యాక్టరీ యాజమాని ప్రశాంత్ తెలిపారు. సుమారు 6 కోట్ల పత్తి, 2 కోట్ల పత్తి బెల్లు (600 బెల్లు), సుమారు కోటి రూపాయల పత్తి సీడ్, మోటర్లు పూర్తిగా దగ్ధమైందని యజమాని తెలిపారు. పత్తి ఫ్యాక్టరీలో చెలరేగుతున్న మంటలను అదుపు చేయడానికి రెండు ఫైర్ ఇంజన్ తో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పత్తిని అమ్ముకోవడానికి తీసుకొచ్చిన రైతుల రెండు బొలెరో వాహనాలు కూడా కాలిపోవడం జరిగింది. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చోటుచేసుకుంద ని యాజమాని ప్రశాంత్ పేర్కొన్నారు.