నకిలీ విత్తనాలు అమ్మేవారిని ఉరితీయాలి ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా అదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోవటం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ప్రజల గుండెలను పిండేస్తున్నాయని. కాని ఇదేదో చిన్నపాటి మోసమే అన్నట్లు అధికారులు చిన్న చిన్న కేసులు పెట్టి చేతులు దులుపుకోవటం మరింత విస్మయం కలిగించే విషయం అన్నారు. కావున మన అన్నదాతలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కొన్ని కఠిన చట్టాలను తయారు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదోని జిల్లా సమితి తరపున డిమాండ్ చేశారు.
నకిలీ విత్తనాలను తయారు చేసే వారు, అమ్మేవారు ప్రత్యక్షంగా రైతుల ఆత్మహత్యలకు, వారి కుటుంబాలు రోడ్డున పడటానికి కారకులు అవుతున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రజలకు అవసరమైన పంటలు కొరత ఏర్పడుటకు కారణమౌతున్నారు. దేశాభివృద్ధి కుంటుపడటంలో పరోక్ష పాత్ర వహిస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారని కావున నకిలీ విత్తనాలు తయారీదారులు,అమ్మకందారులను ఉరిశిక్ష విధించే చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసి అమలు చేయాలి అని నకిలీ విత్తనాలను తయారు చేసే వారు, అమ్మేవారి ఆస్తులను జప్తు చేసి వాటిని నకిలీ విత్తనాల వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని భవిష్యత్తులో నకిలీ విత్తనాలు తయారు చేయాలి, అమ్మాలి ఆలోచన వస్తే వెన్నులో వణుకుపుట్టాలి ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా వీరిని కాపాడేందుకు రాజకీయ నాయకులు గాని ఇతరులు గాని ముందుకు రావటం సిగ్గు చేటు, వీరు రైతు ద్రోహులు. కావున సందట్లో సడేమియాలా బ్రోకర్లలా మధ్యలో దూరి నకిలీ విత్తనాల ద్రోహులను కాపాడేవారు మారాలని లేని పక్షంలో వారు భవిష్యత్తులో నీఛులుగా గుర్తింపబడతారు అని తెలిపారు. మనుషులు, చట్టాలు శిక్షించకున్నా దేవుని శిక్షకు వీరు గురికాక తప్పదని హెచ్చరిచారు.
కావున రైతులు ఉసురు పోసుకోవద్దని ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ.నూర్ అహ్మద్ హితవుపలికారు. ఈ కార్యక్రమంలో ఆదోని జిల్లా సమితి రూరల్ నాయకులు పి.వి. కుబేర స్వామి పాల్గొన్నారు.



