అగ్నిమాపక వాహనం వెళ్లడానికి సిమెంటు రోడ్డు వేయండి

కర్నూలు జిల్లా ఆదోనిలో అగ్నిమాపక కేంద్ర కార్యాలయానికి సిమెంటు రోడ్డు వేయలని ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. నూర్ అహ్మద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి మీడియా ముందు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక కేంద్రానికి వెళ్లే దారి మొత్తం రిజిస్టర్ ఆఫీసుకు వచ్చిన వినియోగదారుల వాహనాలతో నిండిపోవటంతో అగ్నిమాపక వాహనాల రాకపోకలు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అత్యవసరంగా బయలుదేరవలసిన అగ్నిమాపక వాహనాలు రోడ్ మొత్తం వాహనాలతో నిండి ఉండటం వల్ల బయటకు పోవటం చాలా ఇబ్బందికరముగా మారి అవతల అగ్నిప్రమాద స్థలానికి చేరడానికి ఆలస్యం అవుతోంది. కావున అగ్నిప్రమాద తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది అని తెలిపారు. గతంలో మునిసిపల్ కమీషనర్ రామలింగేశ్వర్ ఇక్కడ సిమెంటు రోడ్ వేయటానికి ప్రతిపాదన సిద్ధం చేసినా పనులు ముందుకు సాగలేదు. ఇప్పటికైన అధికారులు స్పందించి అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సిమెంటు రోడ్డు వేయాలని ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు.

ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. నూర్ అహ్మద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version