బిజెపి హిందూ మతోన్మాద విదానాలను తిప్పి కొట్టాలి CPM

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హిందూ మత తత్వ విధానాలను తిప్పికొట్టే దానికి సిపిఎం పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు పిలుపునిచ్చారు.

ఆదోని, పెడ్డకడబురు, కోస్గి, కౌతాళం మండలాల సిపిఎం పార్టీ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులు ఆదోని మండలం పాండవుగల్ పాతూరు ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతం భాగాన్ని రెచ్చగొడుతూ మైనార్టీలు ముస్లింలపై దాడులు తీవ్రతరం చేస్తున్నాయని, హిందూ మతం మాదాన్ని రెచ్చగొట్టి 2024లో కూడా అధికారంలోకి రావాలని కుట్ర బిజెపి ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. అట్లాగే ఈ మతతత్వ విధానాలను తిప్పికొట్టేందుకు సిపిఎం పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని అందుకోసం బుధవారం, గురువారం జరిగే రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్లాసులో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వరకు సభ్యులు కేవీ నారాయణ, క్లాసులకు ప్రిన్సిపల్ గా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మల్లయ్య వ్యవహరించారు. ఈ ఈ క్లాసుల్లో సిపిఎం పార్టీ ఆదోని మండల కార్యదర్శి కే లింగన్న, సిపిఎం పార్టీ పెద్దకడబురు మండల కార్యదర్శి ఈ తిక్కన్న, కోసిగి పార్టీ మండల కన్వీనర్ రాముడు, కౌతాళం పార్టీ మండల కన్వీనర్ ఎం ఈరన్న, సిపిఎం పార్టీ ఆదోని మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి నాలుగు మండలాల నుండి కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న సిపిఎం నాయకులు
రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న సిపిఎం నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version