హత్య కేసులో జీవిత ఖైదు విధించిన ఆదోని II ADJ court జడ్జి P. J. సుధా

కర్నూలు జిల్లా చిప్పగిరి మండల పరిధిలోని డేగులపాడు గ్రామానికి చెందిన దయ్యాల వెంకటస్వామికి జీవిత ఖైదు విధించిన ఆదోని రెండవ అడిషనల్ డిస్టిక్ట్ కోర్టు జడ్జ్ P. J. సుధా. చిప్పగిరి ఎస్సై మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు 3/6/2021 సంవత్సరంలో డేగులపాడు గ్రామానికి చెందిన దయ్యాల వెంకటస్వామి అనే వ్యక్తి తాగుడుకు బానిసై తనకు మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్యను రోకలితో కొట్టి హత్య చేసినట్టు కేసు నమోదు అయిందని, నేరం రుజువు కావడంతో ఆదోని రెండవ అడిషనల్ డిస్టిక్ట్ కోర్టు జడ్జ్ P. J. సుధా జీవిత ఖైదు విధించినట్లు ఎస్సై తెలిపారు,
పనితీరులో మంచి ప్రతిభ కనబరచిన చిప్పగిరి SI K.మల్లికార్జున ను మరియు కోర్టు కానిస్టేబుల్ భాస్కర్ ను జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ అభినందించినరు.
చిప్పగిరి PS క్రైమ్ నెంబర్ 85/2021 U/S 498(A), 302 IPC and SC No. 45/2022 కేసు లో ఈ రోజు 2023 జూన్ 21 వ తేదీన ఆదోని II ADJ court జడ్జి P. J. సుధా తీర్పు వెలువడించినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top